వాల్ నట్స్ కూడా డిప్రెషన్‌ను తరిమికొడతాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో వీటి పాత్ర కీలకం. నిత్యం వాల్‌నట్స్ తినడం అలవాటు చేసుకుంటే డిప్రెషన్ పరార్ అవుతుంది.
టమాటాలు కూడా డిప్రెషన్‌ను దూరం చేస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే ఫోలిక్ యాసిడ్ డిప్రెషన్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఒత్తిడి నుంచి పూర్తిగా ఉపశమనం కలిగిస్తాయి.
బంగాళదుంప డిప్రెషన్‌కు మంచి ఫుడ్‌గా ఉపయోగపడుతుంది. ఇందులోని సుగుణాలు మనస్సును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒత్తిడి తగ్గిస్తుంది.
కమలాపండు కూడా డిప్రెషన్‌కు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయిని తగ్గిస్తుంది.
ఇక ఉల్లిపాయలు కూడా డిప్రెషన్‌కు మంచి ఔషధంలా పని చేస్తాయి. ఉల్లిలోని మంచి గుణాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మానసిక సమస్యలు దూరం చేస్తుంది.
మెంటల్ హెల్త్‌ను బాగు చేయడంలో జీడిపప్పు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో మెగ్నీషియం మానసిక బలహీనతలను దూరం చేస్తుంది.
డిప్రెషన్‌తో బాధపడే వారు రోజు కచ్చితంగా క్యారెట్ తీసుకోవాలి. వీటిలో ఉండే ఐసోమర్లు మెంటల్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మేలు చేస్తాయి.
డిప్రెషన్‌కు చెక్ పెట్టడంలో గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ బి మెంటల్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది.