చింతచిగురు ఔషధ విలువలు తెలిస్తే..అస్సలు వదిలిపెట్టరు.

09 December 2023

చింతచిగురు కేవలం రుచికి మాత్రమే కాదు దీన్ని ఉపయోగించడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 

చింత చిగురు పప్పు ,రొయ్యల ఇగురు, చింత చిగురు పచ్చడి..వేడి వేడి అన్నంతో వీటిలో ఏదైనా కాంబినేషన్ తలచుకుంటే నోట్లో నీళ్లు ఊరుతుంది.

చింతచిగురులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది మనలో రక్తహీనత సమస్యను అదుపులో పెడుతుంది. 

చిన్నపిల్లలకి చింత చిగురు పెట్టడం వల్ల మంచి బలం చేకూరుతుంది. కామెర్ల వ్యాధిని కూడా నయం చేసే గుణం చింత చిగురుకు ఉంది.

చింతచిగురు ఆహారంలో తీసుకోవడం వల్ల వాతం వంటి లక్షణాలు తగ్గడమే కాకుండా కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.

గొంతు నొప్పి ,ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు కూడా చింతచిగురు బాగా పనిచేస్తుంది. కడుపులో నులిపురుగుల సమస్య కూడా తలెత్తదు.

చింత చిగురును తినడం వల్ల  రోదనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చింతచిగురు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు.