సపోటా షేక్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?
18 January 2024
TV9 Telugu
సపోటాలో గ్లూకోజ్, క్యాలరీలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా సపోటాషేక్ తాగితే ఇది బరువు పెరగడంలో ఎంతగానో సహాయపడుతుంది.
సపోటాషేక్ తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సపోటాషేక్ తీసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.
కడుపులోని పేగులకు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సపోటా ఎంతో సహాయపడుతుంది. కీళ్ల నొప్పి, ఎముకల నొప్పి ఉన్నవారు సపోటా పండును తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
క్యాన్సర్ వ్యాధులను దరి చేరకుండా ఉండటంలో సపోటా ఎంతగానో సహాయపడుతుంది. సపోటా షేక్ మన శరీరాని ఎంతో మేలు చేస్తుంది.
అందానికి, ముఖంపై మచ్చలు, మొటిమలు, కురుపులు వంటివి లేని చర్మంతో ఉండాలంటే సపోటాలు తినాలి. ఇవి చర్మం, జుట్టును కాపాడతాయి.
గర్భిణీలలో ఉదయం వేళ చాలా నీరసంగా ఉంటుంది. వాళ్లు సపోటాలు ఎనర్జీ ఇస్తాయి. అలాగే... పొట్టలో పసికందుకు కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసి, పొట్టలో సమస్యలను నివారిస్తుంది.
సపోటాల్లోని మెగ్నీషియం రక్త నాళాల్ని చురుగ్గా చేస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తం సరిగా లేని వాళ్లు సపోటాలు తినాలి.
సపోటాల్లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా చేస్తాయి. సపోటాల్లోని ఫోలేట్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటివి ఎముకలు ధృఢంగా మారేలా చేస్తాయి.