బీర్యానీ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.?

TV9 Telugu

27 January 2024

బిర్యానీ ఆకులు తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణుల చెబుతున్నారు. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ తగ్గిస్తుంది.  

బిర్యానీ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటుంది. అలాగే, మినరల్స్‌, ఫైబర్‌ వంటి గుణాలు శరీరానికి లభిస్తాయి. బిర్యానీ ఆకులు తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తొలుగుతాయి. 

బీర్యానీ ఆకులను తరచూగా వాడటం వల్ల జీర్ణ సమస్యలు, అంటువ్యాధులు, మూత్రవిసర్జన సమస్యలకు నుంచి ఉపశమనం పొందవచ్చుని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

బిర్యానీ ఆకు కడుపు నొప్పి, ఊపిరితిత్తులతో ఉండే కఫం, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి సహాయపడుతుంది. ఇది ఆర్థరైటిస్ , నరాల నొప్పి చికిత్సలో కూడా సహాయపడుతుంది.

యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ డయేరియా , యాంటీ డయాబెటిక్ లక్షణాలు బిర్యానీ ఆకులలో పుష్కలంగా లభిస్తాయి. బిర్యానీ ఆకు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. 

బిర్యానీ ఆకులలో ఉండే రసాయన తీసుకోవడం వల్ల కడుపు నొప్పికి , ప్రేగు సిండ్రోమ్ నుంచి ఉపశమనం పొందవచ్చు. రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను అదుపు చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

అంతేకాకుండా  బిర్యానీ ఆకుల్లో ఐరన్‌, కాల్షియం, విటమిన్‌-కె పుష్కలం లభిస్తాయి. ఇవి ఎముకల దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.

రక్తపోటును అదుపులో ఉంచడంలో బిర్యానీ ఆకు సహాయపడుతుంది.  జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటిచూపుతో పాటు చర్మ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.