ప్రతీ రోజూ పుల్లటి పెరుగును ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
పుల్లటి పెరుగును నిత్యం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శరీరం వ్యాధులను తట్టుకునే శక్తి పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పుల్లని పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బీపీ అదుపులో ఉంటుంది.
పుల్లటి పెరుగు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత పెరుగు తీసుకుంటే.. కార్టిసాల్ హార్మోన్ తగ్గుతుంది. దీంతో ఊబకాయం సమస్య రాదు.
పుల్లటి పెరుగులో ప్రోబయోటిక్స్ వంటి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీంతో నిరోధక శక్తి పెరుగుతుంది.
ఇక పుల్లటి పెరుగను తీసుకోవడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. పెరుగులోని లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఈస్ట్‌ను సమతుల్యంగా ఉంచుతుంది. ఇది మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పెరుగులో ఉండే మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పెరుగును క్రమంతప్పకుండా తీసుకోవాలి.
ఇక గుండెలో మంట, గ్యాస్ సమస్యను తగ్గించడంలో పెరుగు ఎంతగానో సహాయపడుతుంది. పెరుగులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.