08 September 2023

వాతావరణం మారుతుంది..  సీజనల్‌ వ్యాదులు గురించి  అప్రమత్తం.!

ఎండాకాలంను దాటుకుని వానాకాలంలోకి వస్తున్నామంటేనే వివిధ రకాల సీజనల్‌ వ్యాదులు పొంచి ఉంటాయని గుర్తుంచుకోవాలి.

వాన చినుకులు మనసుకి హాయిగా అనిపించినా ఆరోగ్యంపూ మాత్రం ఎఫెక్ట్‌ చూపుతుంటాయి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడడం కారణంగా వైరస్‌ల దాడి ఎక్కువ ఉంటుంది.

వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఈ పరిణామాలు మనం శరీరాన్ని వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల దాడికి గురవుతుంటుంది. 

వానాకాలం మొదలైందంటేనే జలుబు, జ్వరం అనేవి అటాక్‌ చేస్తుంటాయి. ఈ సమస్య వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం జాప్యం చేయకూడదు.

వానాకాలం రావడంతోనే మలేరియాను వెంటబెట్టుకుని వస్తుంది. వాన నీరు నిలిచిన చోట దోమల బెడద ఎక్కువగా ఉంటుంది.

ప్రాణాంతక డెంగ్యూ నుంచి రక్షించుకోవాలంటే దాన్ని మోసుకొని వచ్చే దోమకాటు నుంచి మనల్ని మనం ముందుగా రక్షించుకోవాలి. 

జీర్ణాకోశ సమస్యలు, అతిసారం, డీహైడ్రేషన్ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. కాచి చల్లార్చిన నీటిని తాగడమే ఉత్తమం.

టైఫాయిడ్ జ్వరం కూడా కలుషిత ఆహారం, కలుషి నీటి వల్ల వాటిల్లే ప్రమాదం ఉంది. పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల సమస్యను దరికి చేరకుండా చేయొచ్చు. 

కలుషిత ఆహారం, కలుషిత నీటి వల్ల హెపటైటిస్ ఎ సమస్య ఉత్పన్నమవుతుంది. జ్వరం, వాంతులు, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌ కావాలి. 

వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా పోషకాహారం తీసుకోవాలి. రోగననిరోధక శక్తిని పెంచే ఆహారం తినాలి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవాలి.