చలికాలంలో అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?

TV9 Telugu

14 January 2024

అరటి పండ్లలో చాలా న్యూట్రియంట్స్  ఉంటాయి. అంతేకాదు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర వంటి విటమిన్స్ ఉంటాయి. 

అరటి పండులో ఉండే న్యూట్రియంట్స్  ఎముక బలం పెంచడానికి, గుండె ఆరోగ్యం పెంచడానికి, ఎనర్జీ లెవల్స్ పెంచడానికి సహాయపడతాయి.

అరటి పండ్లలో ఉండే ఫైబర్  ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువగా సహాయపడుతుంది. చలికాలంలో సాధారణంగా అందరూ ఫిజికల్ యాక్టివిటీకి చాలా దూరంగా ఉంటారు. 

అరటి పండ్లు తక్షణ శక్తిని అందిస్తాయి. ఈ చలికాలంలో మనకు ఎక్కువగా బద్దకంగా, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో అరటి పండ్లు తీసుకోవడం వల్ల మనకు వెంటనే ఎనర్జీ వస్తుంది. 

నిద్రలేమితో ఇబ్బందివాడే వారు సాయంత్ర వేళ ఒకటి లేదా.. రెండు అరటి పండ్లు తింటే రాత్రిపూట చాలా మంచిగా నిద్రపడుతుంది. నిద్రలేని సమస్య నుంచి బయటపడొచ్చు. అరటిపండులో ఉండే మెగ్నీషియం ... మంచి నిద్రకు తోడ్పడుతుంది.

దగ్గు, జ్వరం, ఆస్తమా లాంటి సమస్యలు ఉణ్నవారు తప్ప.. మిగిలినవారు అందరూ... నిస్సందేహంగా చలికాలంలోనూ అరటి పండ్లను ఆస్వాదించవచ్చు. అయితే.. చలికాలంలో అరటిపండు ను రాత్రిపూట మాత్రం తినకూడదు.

అరటి పండ్లలో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి... మన ఎముకలు బలపడటానికి కూడా సహాయపడతాయి. చలికాలంలో  అరటి పండ్లు తినడం వల్ల  ఎముకల బలంగా మారతాయి.

చలికాలంలో తరచూ జీర్ణ సమస్యలతో ఇబ్బందిపడేవారు అరటి పండు తినడం వల్ల అరుగుదల సమస్యలు రాకుండా ఉంటాయి.