చైనా అల్లానికి చెక్ పెట్టిన మన దేశపు అల్లం.. ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర

04 January 2024

TV9 Telugu

భారతదేశానికి చెందిన ఈ 'అల్లం' ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. దీంతో ఇప్పుడు చైనాకి చెందిన నకిలీ ఉత్పత్తులైన అల్లాన్ని తినాల్సిన అవసరం కలుగదు.   

భారతదేశపు అల్లం

అరుణాచల్ ప్రదేశ్ ప్రత్యేక అల్లం 'ఆది కికర్' GI ట్యాగ్‌ను పొందింది. నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే తయారు చేయబడిన లేదా ఉత్పత్తి చేయబడిన వస్తువులకు GI ట్యాగ్ ఇవ్వబడుతుంది.

GI ట్యాగ్ వచ్చింది

ఆది కికర్ అల్లం అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్, సియాంగ్ , ఎగువ సియాంగ్ జిల్లాలలో పండిస్తారు. ఇది దీని రుచి , ఆకృతికి ప్రసిద్ధి చెందింది.

ఎక్కడ పండుతుందంటే 

GI ట్యాగ్ పొందిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఈ అల్లం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం సులభం అవుతుంది. అంతేకాదు చైనాకి చెందిన  'నకిలీ అల్లాన్ని సవాలు చేస్తుంది.

'నకిలీ అల్లం 

అరుణాచల్ ప్రదేశ్ నుండి అల్లం మాత్రమే కాదు, టిబెటన్ నివాసితుల చేతితో తయారు చేసిన కార్పెట్‌లు , వాంచు కమ్యూనిటీ చేసిన చెక్క వస్తువులకు కూడా ట్యాగ్ వచ్చింది.

వారికి ట్యాగ్ కూడా వచ్చింది 

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన వారు తయారు చేసే కార్పెట్‌కు GI ట్యాగ్ వచ్చింది. వీటిని టిబెటన్ శరణార్థులు తయారు చేస్తారు. వీరు ప్రత్యేకమైన డిజైన్, ఆకృతికి ప్రసిద్ధి చెందారు.

టిబెటన్ శరణార్థులు 

అరుణాచల్ ప్రదేశ్‌లోని వాంచు కమ్యూనిటీ చెక్కపై చేతితో కళాకృతులను తయారు చేస్తుంది. దీని క్రాఫ్ట్ చాలా భిన్నంగా ఉంటుంది. హస్తకళాకారులు బుద్ధ భగవానుడి విగ్రహాలు, జంతువులు,  బొమ్మలను తయారు చేస్తారు

చెక్క కళ  

ఇంతకుముందు  అరుణాచల్ యాక్ పాలతో తయారు చేసిన జున్ను 'యాక్ చుర్పి', 'ఖమ్తి', నంసాయ్ జిల్లాకు చెందిన వివిధ రకాల స్టిక్కీ రైస్ , చాంగ్లాంగ్ జిల్లాకు చెందిన 'తంగ్సా క్లాత్' జిఐ ట్యాగ్‌ను పొందాయి.

ఈ ఉత్పత్తులకు ట్యాగ్