డ్రాగన్ ఫ్రూట్ ఒక సూపర్ ఫుడ్.. ఆరోగ్యానికి మేలు 

18 November 2023

రోజుకు ఒక డ్రాగన్ ఫ్రూట్ తింటే మంచి ఆరోగ్యం, మెరిసే చర్మం, మెరిసే జుట్టు సొంతం అవుతాయి. విటమిన్లు, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. 

ఆరోగ్యానికి మేలు 

డ్రాగన్ ఫ్రూట్లో ఉండే యాంటీఆక్సిడెంట్ల, బెటాలైన్‌లు ఎల్‌డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ దెబ్బతినకుండా లేదా ఆక్సీకరణం చెందకుండా ఉంచుతాయి.

ఆక్సీకరణం

డ్రాగన్ ఫ్రూట్లోని ఫ్లేవనాయిడ్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, గుండె వ్యాధులు బారిన పడకుండా చూస్తాయి.

ఫ్లేవనాయిడ్స్

దీనిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడే వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది.

క్యాన్సర్ నిరోధక లక్షణాలు

డ్రాగన్ ఫ్రూట్‌లో కెరోటినాయిడ్లు ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీర్ణ శక్తిని పెంచే ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాను రక్షిస్తుంది.

జీర్ణ శక్తిని

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి అధికం. కెరోటినాయిడ్స్‌తో పాటు, తెల్ల రక్త కణాలను రక్షిస్తుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.

తెల్ల రక్త కణాలు 

డ్రాగన్ ఫ్రూట్ టైప్ II డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడేలా చేస్తుంది. 

డయాబెటిస్‌

ఈ ఫ్రూట్ లోని బీటా కారోటీన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటిశుక్లం వంటి కంటి సమస్యల నివారణలో ఇది సహాయపడుతుంది. 

కళ్లు ఆరోగ్యంగా