ఫూల్ మఖానా.. తామర గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?
09 January 2024
TV9 Telugu
తామర గింజలు తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిని మార్కెట్‌లో ఫూల్ మఖానా అని అమ్ముతారు.
ఫూల్ మఖానా చూడడానికి తెల్లగా, గుండ్రంగా ఉంటాయి. ఫూల్ మఖానా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.
ఈ ఫూల్ మఖానాతో చిరుతిళ్లు, కూరలను తయారు చేస్తుంటారు. ఇందులో ప్రోటీన్,ఫైబర్ శాతం అధికంగా లభిస్తుంది. ఫూల్ మఖానాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
అధిక బరువుతో ఉన్నవారు ఆకలి ఎక్కువగా ఉంటే ఈ మఖానా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో పదే పదే తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గుతారు.
ఫూల్ మఖానాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల సులభంగా బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా
దీని వల్ల నరాల పనితీరు మెరుగుపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఫూల్ మఖానాలో మెగ్నీషియం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఎముకలను, దంతాలను ధృడంగా ఉంచడంలో కూడా ఫూల్ మఖానా మనకు సహాయపడుతుంది. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు వంటివి తగ్గుతాయి.
గుండె పనితీరును మెరుగుపరచడంలో ఫూల్ మఖానా ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని మెగ్నిషియం, గల్లిక్ యాసిడ్స్ గుండెపోటు వంటి వ్యాధులను తగ్గిస్తుంది.