యాలకులతో బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్‌ చేయండి ఇలా!

TV9 Telugu

22 January 2024

అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ఈ యాలకులను రాత్రిపూట గోరువెచ్చని నీరుతో కలిపి తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయట పడుతారు.

యాలకులు శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను ఎక్కువ, తక్కువ కాకుండా యాలకులు సహాయపడుతాయి.

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారికి యాలకులు ఎంతో మేలు చేస్తాయి.  కిడ్నీలలో ఉండే మలినాలను తొలగించడంలో ఎంతో సహాయపడుతాయి.  

చర్మంపై వచ్చే నల్ల మచ్చలను తగ్గించడంలో యాలకులు దోహదపడుతాయి. జుట్టు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

నోటి దుర్వాసనను  వస్తే ఫ్రెష్‌ నర్‌గా వీటిని ఉపయోగించవచ్చు.అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడే వారు యాలకులను తినడడం వల్ల మేలు కలుగుతుంది.

 ముఖ్యంగా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. లివర్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు యాలకులు చాలా సహాయపడుతుంది. 

యాలకుల టీ తాగితే మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కఫం,  ఊపిరాడకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ యాలకులతో ఉపశమనం పొందవచ్చు.

నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్థ్యం లేనివారు ప్రతిరోజు యాలకులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.