2 నిమిషాలే అని, ఆతృతగా కానిచ్చేస్తున్నారా.. మీ గొయ్యి మీరే తీసుకున్నట్లే
Venkata Chari
06 Jul 2025
మీరు ఇన్‌స్టంట్ నూడుల్స్ అభిమానినా? అవును అయితే, న్యూడిల్స్ వల్ల కలిగే 5 దుష్ప్రభావాలను తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే ప్రమాదంలో కూరుకపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇన్‌స్టంట్ నూడుల్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. వాటి రుచితోపాటు కేవలం 2 నిమిషాల్లో రెడీ అవ్వడం వల్ల అందరికీ నచ్చుతున్నాయి. అయితే, ఇన్‌స్టంట్ నూడుల్స్ ఆరోగ్యకరమైన ఆహారంగా మాత్రం పనికిరావు.
ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో అధిక సోడియం, సంతృప్త, తక్కువ పోషక విలువలు వంటి అంశాలు కనిపిస్తాయి. ఇవి మన శరీరంపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇన్‌స్టంట్ నూడుల్స్ తీసుకుంటే, మీరు రక్తహీనతతో బాధపడవచ్చు. ఇవి విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలను అందించవు. దీంతో పోషక లోపాల ప్రమాదాన్ని పెంచుతాయి.
ఇన్‌స్టంట్ నూడుల్స్ తినడం వల్ల మన శరీరంలోని ఎముకలు బలహీనపడి కీళ్ల నొప్పులు తక్కువ వయసులోనే వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ నూడుల్స్ మోనోసోడియం గ్లుటామేట్ కలిగి ఉంటుంది.
ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో పోషకాలు తక్కువగా ఉండటం వల్ల, జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. ఇందులో ఉన్న మోనోసోడియం గ్లుటామేట్ వల్ల బరువు పెరగడం, తలనొప్పి, వికారం, అధిక రక్తపోటు వచ్చేలా చేస్తుంది.
ఇన్‌స్టంట్ నూడుల్స్ రుచిని కాపాడుకోవడానికి అధిక మొత్తంలో సోడియం కలిగి ఉంటుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇప్పటికే ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు మానేయడం మంచిది.
ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో ఉప్పు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాలకు చాలా హానికరం. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా పెరిగేలా చేస్తోంది.