చలికాలంలో బిస్కెట్స్‌ మెత్తగవుతున్నాయా.? 

16 December 2023

బిస్కెట్స్‌ మెత్తగా కాకూడదంటే వీలైనంత వరకు ప్లాస్టిక్‌, అల్యుమినియం డబ్బాలు, గాజు పాత్రల్లో నిల్వచేయాలి. 

ఇక గాలి చొరబడని పాత్రల్లో ఉంటే బిస్కెట్స్ క్రిస్పీగా ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేకమైన పాత్రలను ఉపయోగించాలి.

బిస్కెట్స్‌ను డబ్బాల్లో నిల్వ చేసే సమయంలో అడుగు భాగంలో టిష్యు పేపర్లు వేయాలి. ఇలా చేయడం వల్ల బిస్కెట్స్‌ మెత్తపడవు. 

బిస్కెట్స్‌ మెత్తపడకూడదంటే కవర్స్‌లో వేసి జిప్‌లాక్‌ పౌచ్‌లను సైతం ఉపయోగించవచ్చు. ఇలా చేసినా బిస్కెట్స్‌ మెత్తగా అవ్వవు.

బిస్కెట్స్‌ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. గాలి చొరబడని డబ్బాల్లో వేసి రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి. ఇలా చేస్తే బిస్కెట్స్‌ త్వరగా పాడవ్వవు. 

ఇక బిస్కెట్స్‌ ఎక్కువకాలం కరకరమనేలా ఉండాలంటే వాటిని గాజు పాత్రల్లో నిల్వచేయాలి. వీటివల్ల రుచి కూడా పాడవ్వకుండా ఉంటుంది. 

ఒకవేళ పొరపాటు బిస్కెట్స్‌ మొత్తగా అయితే ఓవెన్‌ లేదా ఎయిర్‌ ఫ్రైయర్‌లో ఉంచి వేడి చేస్తే మళ్లీ క్రిస్పీగా మారుతాయి.