31 May 2024

రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా.?  ఇలా చేయండి.. 

Narender.Vaitla

సాధారణంగా ఒత్తిడి నిద్రలేమికి కారణమవుతుందని నిపుణులు చెబుతుంటారు. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవాలి.

 ప్రతీ రోజూ యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని తప్పకుండా చేయాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల మనసు ప్రశాంతంగా మారి సరిగ్గా నిద్రపడుతుంది.

ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా నిద్రలేమి సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజులో కచ్చితంగా ఎంతో కొంత శారీరక శ్రమ ఉండాలని సూచిస్తున్నారు.

 పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోయే రెండు గంటల ముందు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్‌లను దూరంగా పెట్టేయాలి.

సాధారణంగా ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర వస్తుందని భావిస్తుంటాం. కానీ మొదట్లో మత్తుగా అనిపించినా మధ్యలో నిద్రలేమికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మనలో కొందరికి పడుకునే ముందు కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలాంటి అలవాట్లు ఉంటే కచ్చితంగా నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పడుకునే ముందు కాఫీ, టీ తాగకూడదు.

ఇక రాత్రుళ్లు స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తి నిద్రలేమికి దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రాత్రి లైట్ ఫుడ్‌ తీసుకోవడమే బెటర్‌.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం