వింత హోలీ.. పురుషులు కనిపిస్తే ‘బాదుడే’
TV9 Telugu
23 March 2024
దేశంలో పలు పండుగలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయ రీతిలో జరుగుతుంటాయి. హోలీ విషయంలోనూ ఇదే కనిపిస్తుంది.
హోలీకి ఉత్తరప్రదేశ్‌లోని బర్సానా చాలా ప్రసిద్ధి. ఇక్కడ రాధా రాణి ఆలయంలో లాత్ మార్ హోలీ అనే క్రీడను ఆడతారు.
ఇక్కడి మహిళలంతా పక్కనే ఉన్న నందగావ్ గ్రామం నుంచి వచ్చే పురుషుల కోసం కర్రలు పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు.
ఒక్కసారి పురుషులు ఊళ్లోకి అడుగు పెట్టగానే లాఠీలతో తరుముతూ రంగులు పులుముతూ పరుగులు పెడుతూ సందడి చేస్తారు.
బృందావన్‌లో కూడా స్త్రీలు లాఠీలతో కొడతారు. లాఠీ దెబ్బలు తమపై పడకుండా డాలు లేదా షీల్డ్‌తో మగవారు తమను తాము రక్షించుకుంటారు.
ద్వాపర యుగంలో కృష్ణుడు రాధకు రంగులు పులిమి పారిపోతుంటే, అమ్మాయిలంతా కర్రలు పట్టుకుని ఆయన్ని వెంబడించారన్న నమ్మకం వీరిది
హోలీ సందర్భంగా ఇక్కడ లాఠీలతో కొట్టడమనేది సరదా సాంప్రదాయం మాత్రమే. ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వకుండా కొడతారు.
ఈ ఏడాది మార్చ్ 25న హోలీ పండగ రానుంది. దేశవ్యాప్తంగా అన్ని సంప్రదాయాల్లో ఈ పండగని ఘనంగా జరుపుకొంటారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి