రంగు రంగుల పూలతో విరిసిన వసంతానికి స్వాగతం చెబుతూ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకొనే రంగుల పండగే హోలీ
హోలీ రంగుల సంబరంలో పెద్దలూ చిన్న పిల్లలైపోతారు. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ పూసుకుంటూ ఎటుచూసినా సంతోషాల వెల్లువలే కనిపిస్తాయి
కానీ పండగ అయిపోయిన తర్వాత ఆ వర్ణాలను వదిలించడానికి మాత్రం చాలా కష్టపడాలి. ఇదంతా తెలిసినా చాలామంది హోలీ పండగ రోజు తెలుపు రంగు దుస్తులే ధరిస్తారు
హోలీ నాడు ఎందుకు తెలుపు వస్త్రాలు ధరిస్తారు? అందుకు కారణమేంటి? ఈ సందేహం మీకూ వచ్చినట్లయితే ఇది మీకోసమే.. నిజానికి, హోలీనాడు రాహువు చాలా కోపంగా ఉంటాడట
దీంతో ఈ రోజున ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎదురవ్వడం, తెలియకుండానే నోరు జారడం, ఇంట్లోవాళ్లతో గొడవలు... ఇలాంటి వాటన్నింటికీ అవకాశం ఎక్కువగా ఉంటుందట
అందుకే రాహువు కోపాన్ని తప్పించుకోవడానికి తెలుపు దుస్తులు ధరిస్తారని ‘సనాతన ధర్మం’ చెబుతోంది. కాలం మారింది.. ఇంకా ఇలాంటివి నమ్ముతారా? అనే సందేహం ఉన్నవాళ్లకి దీని వెనుక శాస్త్రీయ కారణమూ లేకపోలేదు
సాధారణంగా ఏ పండగైనా అయినవాళ్లు, తెలిసిన వాళ్లతోనే జరుపుకొంటాం. కానీ హోలీకి తెలియని వాళ్లైనా వచ్చి రంగు పూయడం సర్వసాధారణం. ఈ పండగ ఉద్దేశం కూడా సరిగ్గా అదే
మన చుట్టూ ఉన్నవాళ్లతో కలిసి మెలిసి, సోదరభావంతో మెలగాలనే కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడటానికి, వసంతంలో వచ్చే ఈ పండగ నాటికి ఎండ తీవ్రత తట్టుకునేందుకు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ఆనవాయితీగా వస్తోంది. అదీ ‘తెలుపు’ వెనక ఉన్న రహస్యం