మీ కాలనీలోని ఒక పెద్ద వృక్షం 10 ఎయిర్ కండిషనింగ్ యూనిట్లకు సమానం. దాని నీడ ఆ ప్రాంత ఉష్ణోగ్రతను 30 శాతం తగ్గిస్తుంది.
చెట్లు శబ్ద కాలుష్యాన్ని 50 శాతం వరకు తగ్గిస్తాయి. వాహనాల రణగొణ ధ్వనులు, నిర్మాణ పనుల ఇతర శబ్దాలను నిరోధిస్తాయి. ఇళ్లు, కార్యాలయాలను నిశ్శబ్దంగా ఉంచుతాయి.
చెట్ల నుంచి విడుదలయ్యే గాలి హానికరమైన కాలుష్య కారకాలను, టాక్సిన్‌లను తొలగిస్తాయి. గాలి నాణ్యత తక్కువున్న నగరాలలో చెట్లు పరిశుభ్రమైన గాలిని అందిస్తాయి.
కొన్ని నగరాల్లో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటం చూస్తాం. చెట్లు ఈ సమస్యను పరిష్కరించడానికి సహకరిస్తాయి.
వర్షాలు కురిసే సమయంలో చెట్లు భారీ మొత్తంలో నీటిని గ్రహించి వరదలు వచ్చే అవకాశాన్ని తగ్గించి నీటి వనరులను కాపాడతాయి
మన భావోద్వేగాలు, ప్రవర్తన, ఆలోచనలు మనం ఉంటున్న ప్రదేశాలపై ఆధారపడి వుంటాయి. చెట్లు మన మనస్తత్వంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.
ప్రకృతి మధ్యలో మెలిగే మనుషులు సంతోషంగా ఉంటారని స్టడీస్‌లో తేలింది. మనిషి శాంతియుతంగా ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి
చెట్లు విరివిగా ఉన్న నగర ప్రాంతాల్లో సైక్లింగ్, రన్నింగ్, నడక మొదలైనవి చేసినట్టయితే మనకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి.