30 September 2023

ఫోన్‌ ఊబిలో చిన్నారులు.. పేరెంట్స్ బీ అలెర్ట్..!

ఫోన్‌ ఊబిలో చిన్నారులు చిక్కుకుంటున్నారనే   విషయాన్ని పేరంట్స్ గమనించాలి 

అన్నం తినకుండా మారాం చేస్తున్నారనో.. అల్లరి ఆపడం కోసమో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతికి ఫోన్‌ ఇస్తుంటారు.

దాంతో పిల్లలు రోజూ నాలుగు గంటలు మొబైల్‌లోనే ఉంటున్నారు. 12 ఏళ్లు పైబడిన వారు ఇంటర్నెట్‌  చూస్తున్నారు

సరదాగా ప్రారంభమైనప్పటికీ.. క్రమంగా పిల్లలకు అదో వ్యసనంగా మారుతోంది.

తాజాగా చిన్నారుల రోజువారీ ఫోన్‌ వినియోగంపై హ్యాపీనెట్జ్‌ అనే సంస్థ సర్వే చేపట్టింది.

12 ఏళ్ల లోపు వయస్సు పిల్లలు 42 శాతం మంది రోజులో 2 - 4  గం. ఫోన్‌ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారని తెలిసింది

74 శాతం మంది పిల్లలు యూట్యూబ్‌ చూస్తుంటే, 12 ఏళ్లు పై బడినవారు గేమింగ్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నారట

 చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు క్రమశిక్షణ అలవాటు చేసినప్పటికీ.. ఫోన్‌ విషయంలో మాత్రం నిలువరించలేకపోతున్నారు.