నీతా అంబానీ దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్.. రూ.365 కోట్లు
02 September 2023
మీరు ఇప్పటి వరకు చాలా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను చూసి ఉంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్ ధర, దీనిని నీతా అంబానీ ఉపయోగిస్తున్నారని టాక్.. నిజం ఏమిటంటే ?
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి విలాసవంతమైన వస్తువులంటే చాలా ఇష్టం అని అందరికీ తెలిసిందే
ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొబైల్‌ని ఉపయోగిస్తున్నారు. దీని ధర ఫెరారీ, BMW లేదా ఏరోప్లేన్ కంటే ఎక్కువ
నీతా అంబానీ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ మొబైల్ ఫోన్ ఉంది. దీని ధర 48.5 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 395 కోట్లు
ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్‌ని తయారు చేసేందుకు ఐఫోన్ 6ని కస్టమైజ్ చేసింది. 24 క్యారెట్ల బంగారంతో పాటు దాని వెనుక ప్యానెల్‌కు పెద్ద పింక్ కలర్ డైమండ్, ప్లాటినం పూత పూయబడింది
నీతా అంబానీ సంపద దాదాపు 21000 కోట్ల రూపాయలు. తాజాగా నీతా అంబానీ ఆర్‌ఐఎల్‌కు రాజీనామా చేశారు. అయితే ఆమె కంపెనీ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.
నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్ తో 40 లక్షల విలువకలిగిన చీర, రూ. 450 కోట్ల ఖరీదైన నెక్లెస్‌ను కొనుగోలు చేశారు
నీతా అంబానీ ఏ ఫోన్‌ని ఉపయోగిస్తుందో తెలియనప్పటికీ.. ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఫోన్ నీతా సొంతం కాదని ఇండియా టుడే టెక్ టీమ్ ధృవీకరించింది.