చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు 

12 December 2023

నిమ్మకాయ పోషక విలువల వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు.. జుట్టు, చర్మానికి కూడా మేలు చేస్తుంది.

నిమ్మకాయ పోషక విలువ

శీతాకాలంలో ప్రజలు తరచుగా చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.  నిమ్మకాయతో త్వరగా ఈ సమస్యను వదిలించుకోవచ్చు

చుండ్రు సమస్య

ఆవాల నూనెలో నిమ్మరసం బాగా కలిపి  జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత జుట్టుని వాష్ చేయాలి. కొన్ని రోజుల్లోనే చుండ్రు పోతుంది

నిమ్మరసం ఆవాల నూనె

ఆలివ్ ఆయిల్‌లో నిమ్మరసం, తేనె మిక్స్ చేసి కనీసం 20 నిమిషాల పాటు అప్లై చేస్తే చుండ్రు తొలగిపోయి జుట్టు బలంగా, మెరుస్తూ ఉంటుంది.

నిమ్మ- తేనె

నిమ్మ రసం,  కలబంద రెండూ జుట్టుకు మేలు చేస్తాయి. ఈ ప్యాక్ ను తలకు, జుట్టుకు పట్టిస్తే చుండ్రు పోయి జుట్టు మెరుస్తుంది.

నిమ్మరసం- అలోవెరా

చలికాలంలో గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి జుట్టును కడుక్కుంటే తలపై పేరుకున్న చుండ్రు, జిడ్డు, మురికి తొలగిపోతుంది.

నిమ్మరసం