03 February 2024
TV9 Telugu
మార్కెట్‌లో పురుగు పట్టకుండా కెమికల్ పౌడర్లు దొరుకుతాయి. వీటిని కలిపిన బియ్యం తింటే ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. కనుక ఈ కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లో చిట్కాలను ఉపయోగించవచ్చు
బియ్యాన్ని నిల్వ చేసే డబ్బాల్లో అగ్గి పెట్టెను తెరిచి పెట్టాలి. అగ్గి పుల్లలకు ఉండే సల్ఫర్ బియ్యానికి పురుగు పట్టకుండా చేస్తుంది.
బియ్యాన్ని నిల్వ చేసే వాటిల్లో వేపాకులు వెయ్యాలి. లేదా వేపాకుల పొడిని ఓ గుడ్డలో కట్టి బియ్యంలో ఉంచితే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల బియ్యానికి పురుగు పట్టదు.
లవంగాలు కూడా బియ్యానికి పురుగు పట్టకుండా చూస్తాయి. దీనిలో ఘాటు స్మెల్ వలన బియ్యంలో పురుగులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
నిల్వ చేసిన బియ్యానికి పురుగులు పట్టకుండా డబ్బాలో బిర్యానీ ఆకులను ఉంచండి. బియ్యాన్ని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.
ఎక్కువ కాలం బియ్యం నిల్వ ఉండాలంటే అప్పుడప్పుడు ఎండలో పెట్టాలి. ఇలా ఎండలో పెట్టడం వల్ల పురుగులు , లార్వాలు, గుడ్లు నశిస్తాయి.
వెల్లుల్లి పొట్టును మనం బయట పడేస్తుంటాం. అలా చేయకుండా వెల్లుల్లి పొట్టు తీసి బియ్యంలో ఉంచడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది.
అగ్గి పుల్లలు