15 September 2023

పిల్లలకు ఆస్తులు కాదు.. తోబుట్టువులను ఇవ్వండి.. !

ఒక్క బిడ్డ చాలు అనుకునే తల్లిదండ్రులు..  పిల్లలకు ఆస్తులు కాదు.. తోబుట్టువులను ఇవ్వండి.. 

తోబుట్టువు లేని  బాల్యం నిస్తేజంగా సాగుతుంది. తల్లిదండ్రులు ఎంత స్నేహితుల్లా ఉన్నా.. అన్నతోనో, చెల్లితోనో గడిపే సమయం చాలా గొప్పది. 

తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుతో పంచుకుంటారు. అంతేకాదు, అన్నదమ్ములే కానీ, అక్కాతమ్ముళ్లే కానీ, అన్నాచెల్లెళ్లే కానీ ఒకరి విషయంలో మరొకరు బాధ్యతగా ఫీలవుతారు. 

తోబుట్టువు ఉంటేనే పంచుకోవడం అంటే ఏంటో తెలుస్తుంది. భావోద్వేగాలను ఎవరితో ఎలా పంచుకోవాలో అర్థమవుతుంది.

భవిష్యత్‌ అవసరాలు ముందుగానే గుర్తించగలిగితే.. ఈ కాలంలోనే కాదు, మరో పాతికేళ్ల తర్వాతైనా ఇద్దరు పిల్లలను పెంచడం పెద్దకష్టమైన పనేం కాదు. 

ఆదాయ మార్గాలు పెంచుకోవడంతో పాటు ఓ ప్లాన్‌తో సాగితే ఇద్దరు పిల్లలు భారం కారు. పిల్లల మధ్య మూడు, నాలుగేళ్ల వ్యత్యాసం ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. 

మీ తదనంతరం మీ వారసుడి కుటుంబం ఒంటరిగా మిగిలిపోవద్దు అనుకుంటే.. చిన్నప్పుడే తోబుట్టువును కానుకగా ఇవ్వండి.

పిల్లలు పుట్టగానే వారిపేరిట అందుబాటులో ఉన్న మంచి పాలసీని తీసుకోవాలి. వాళ్ల ఉన్నత విద్యకి ఆ పాలసీ మొత్తం చేతికి అందేలా ప్రణాళిక వేసుకోవాలి. 

కష్టమైనా ఇద్దరికీ మంచి విద్య అందించాలి. మంచి చదువు చెప్పించకపోతే పిల్లల భవిష్యత్తు రిస్క్‌లో పెట్టినట్టే అని గుర్తుంచుకోండి.