ఈ మసాలాలతో ముడతల చర్మానికి చెక్.. నవ యవ్వనత్వం మీ సొంతం..

08 August 2023

వయసు పెరిగే కొద్ది ముఖంపై ముడతలు, మచ్చలు రావడం సహజం. ఇక వీటిని తొలగించుకునేందుకు కాస్మటిక్స్‌ని ఆశ్రయించాల్సిన పరిస్థితి.

కానీ ఆ కాస్మటిక్స్‌ మచ్చలు, ముడతలపై పనిచేయకపోగా, కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంటాయి.

ఈ క్రమంలోనే ఎలాంటి కాస్మటిక్స్ వాడకుండా మన పూర్వీకులు వాడిన సహజ పద్ధతులను ఆశ్రయించడం మేలని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో వంట గదిలో లభించే కొన్ని సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ సుగంధ ద్రవ్యాలు ఏమిటంటే..?

వంటలో విరివిగా ఉపయోగించే లవంగాల జీర్ణశక్తిని మెరుగుపర్చడమే కాక చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ ఉపయోగకరం. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని యవ్వనంగా చేస్తాయి.

లవంగాలు

అల్లంలోని యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు చర్మం మెరిసేలా, నవయవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇంకా ఇది రోగనిరోధకశక్తిని పెంచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

​అల్లం​

కర్కుమిన్ అనే సమ్మేళనంతో పాటు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన పసుపు చర్మంపై కొత్త కణాల ఉత్పత్తికి దోహదపడతుంది. ఫలితంగా మన చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

పసుపు

అశ్వగంధ ప్రముఖ ఆయుర్వేద ఔషధం. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగిన అశ్వగంధ చర్మ కణాలను కాపాడి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

అశ్వగంధ

రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడం ఉపయోగపడే దాల్చిన చెక్క చర్మంపై మృత కణాలను తొలగించి, మనల్ని నవయవ్వనంగా ఉండేలా చేస్తుంది.

​దాల్చిన చెక్క​