హాట్ స్టిల్స్ తో కుర్రకారుకు విముక్తి కలిగించిన యుక్తి
.. పిక్స్ అదరహో
11 November 2025
Pic credit - Instagram
Phani Ch
టాలీవుడ్ లోకి మరో కొత్త బ్యూటీ వచ్చింది. అందం, అభినయంతో కట్టిపడేసేందుకు సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ.. ఆమె ఎవరో కాదు యుక్తి తరేజా.
నాగశౌర్య హీరోగా నటించిన ‘రంగబలి’ మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ యుక్తి తరేజా.
యుక్తి తరేజా హర్యానాకు లోని కర్నాల్ లో జన్మించింది. ఈమె ఢిల్లీ లో ఓ విశ్వవిద్యాలయంలో డిగ్రీ (కామర్స్) చదివింది ఈ చిన్నది.
ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల ఆమె జీవితం మలుపు తిరిగింది. అక్కడ డాన్స్ పోటీలు, ప్రదర్శనల్లో పాల్గొంటూ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.
2021 లో వచ్చిన ఇమ్రాన్ హష్మీతో కలిసి చేసిన ‘లుట్ గయే’ పాటతో బాగా పాపులర్ అయింది యుక్తి తరేజా. ఈ పాట వల్లే ‘రంగబలి’లో నటించే అవకాశం అందుకుంది.
మాతృభాష హిందీకావడం వల్ల తెలుగులో నటించేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నదట.. కానీ ఆ విషయంలో దర్శకత్వ బృందం సాయం చేసిందని తెలిపింది.
'కే ర్యాంప్' సినిమాతో యుక్తి తరేజా మళ్ళీ ట్రేండింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు యంగ్ హీరోల సరసన ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు అభిమానులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కృతి శెట్టి అందాలను.. మా కళ్ళతో చూడమంటున్న కుర్రకారు.. బాబోయ్
కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే
క్యూట్ గా అందాల మీద ఫోకస్ పెట్టిన.. సొగసుల సోయగం సోనియా సింగ్