16 August 2023

స్టార్ హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పిన రానా

టాలీవుడ్ టాల్ హీరో రానా నుంచి కొత్త సినిమా అప్డేట్స్ రావడం లేదు దాంతో ఆయన ఫ్యాన్స్ అంతా కాస్త నిరాశతో ఉన్నారు.

రానా చివరిగా వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో కనిపించాడు. ఈ వెబ్ సిరీస్ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

అలాగే సోలో హీరోగా చివరిగా విరాట పర్వం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లానాయక్ లో నటించాడు.

అయితే రానా  నుంచి ఓ సాలిడ్ హిట్ మూవీ కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇదిలా ఉంటే రానా ఓ హీరోయిన్ కు క్షమాపణలు చెప్పారు.

ఇటీవల ఆ హీరోయిన్ గురించి రానా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాంతో రానా ఆ హీరోయిన్ కు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

రీసెంట్ గా రానా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోత మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జూ గెస్ట్ గా హాజరయ్యాడు. 

ఈ కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాని , రానా గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ..

బాలీవుడ్ లో దుల్కర్ ఓ సినిమాలో నటించాడు. ఆ సినిమా నిర్మాతలు నా స్నేహితులు కావడంతో ఆ మూవీ షూటింగ్ ను నేను వెళ్ళాను..

షాట్ మధ్యలో ఓ హీరోయిన్ ఫోన్ లో షాపింగ్ గురించి మాట్లాడుతూ ఉంది. దుల్కర్ మాత్రం అక్కడే ఎండలో నిలుచొని ఉండిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు.

దాంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆ హీరోయిన్ సోనమ్ కపూర్ అంటూ కొందరు ఆమె పై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.

 రానా వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆమెకు రానా క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఓ ట్వీట్ ను షేర్ చేశాడు రానా.