25 August 2023

మరోసారి ట్రెండింగ్‌లోకి మహేష్ - రాజమౌళి మూవీ అప్డేట్..

సూపర్‌ స్టార్ ఫ్యాన్స్ మహేష్ అప్‌కమింగ్ సినిమా అప్‌డేట్స్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.. ఎలా అనుకుంటున్నారా.?

కథా రచయిత , రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఇచ్చిన హింట్స్‌తో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఎస్‌ఎస్‌ఎంబీ 29.

ప్రజెంట్ గుంటూరు కారం షూటింగ్‌లో ఉన్నారు మహేష్‌. తన గత చిత్రాలతో ఈ పోలిస్తే ఈ సినిమా షూటింగ్ కాస్త స్పీడుగానే కానిచ్చేస్తున్నారు.

నెక్ట్స్ ఇయర్‌ సంక్రాంతి పక్కా అంటూ క్లారిటీ ఇచ్చారు మహేష్‌. ఆ తరువాత రాజమౌళితో చేయాల్సిన సినిమా వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది.

మహేష్ మూవీ ఆఫ్రికన్‌ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న అడ్వంచరస్ యాక్షన్‌ డ్రామా అని మరోసారి క్లారిటీ ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్‌.

ఈ సినిమా కోసం ఇంకా కాస్టింగ్‌ ఫైనల్‌ చేయలేదని చెప్పిన రచయిత, హాలీవుడ్ స్టార్స్‌ కూడా ఈ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉందన్నారు.

ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉన్న జక్కన్న టీమ్‌, త్వరలో షూట్‌ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.

2024 సంక్రాంతికి గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ లోగా రాజమౌళి సినిమా షూటింగ్ కూడా మొదలవుతుంది. 

గత చిత్రాల అనుభవాలతో ఈ సినిమాను వీలైనంత ఎర్లీగా పూర్తి చేసేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు. సో ముందు వర్క్‌ షాప్ కండక్ట్  చేసి సెట్స్ మీదకు వెళ్లనుంది.