మొట్టమొదటిసారి ఆ హీరోతో కలిసి నటించనున్న రష్మిక మందన్న 

Rajeev 

1 june  2025

Credit: Instagram

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్న.

నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది.

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.

 రీసెంట్ గా పుష్ప సినిమాతో, ఛావా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. 

 ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ధనుష్ నటిస్తున్న కుబేర సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళ్ లో కూడా సినిమాలు చేస్తుంది. 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. 

సుకుమార్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని టాక్.