రూటు మార్చిన నిధి అగర్వాల్.. ప్రభాస్ సినిమా తర్వాత ఆ సీనియర్ హీరోతో.. 

07 November 2025

Pic credit - Instagram

Rajeev 

టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీ పేరు తెచ్చుకుంది అందాల భామ నిధి అగర్వాల్. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

ఆతర్వాత తెలుగులో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. మిస్టర్ మజ్ను, ఆతర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది

 కానీ ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో, హరిహరవీరమల్లు సినిమాలు చేసింది. 

మొత్తంగా ఈ చిన్నది తొమ్మిది సినిమాలు చేసింది. వాటిలో ఒకే ఒక్క హిట్ అందుకుంది. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలోనూ ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

ఇప్పుడు నిధి అగర్వాల్ ఓ సీనియర్ హీరోతో రొమాన్స్ కు రెడీ అయ్యిందని తెలుస్తుంది. ఇంతకూ ఆ సీనియర్ హీరో ఎవరో తెలుసా.?

వెంకటేష్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను అనుకుంటున్నారట