ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. రంగంలో ఆ బ్యూటీ
20 May 2025
Rajeev
Credit: Instagram
దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2, డ్రాగన్ సినిమాలతో రానున్నాడు .
కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు
ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ నటిస్తున్నారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే డ్రాగన్ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కీలక పాత్రలో నటించనుందని టాక్ వినిపిస్తుంది.
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్. గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో విద్య నటించింది.
ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనుందని అంటున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మ్యూజిక్ డైరెక్టర్‌గా కమెడియన్ సప్తగిరి.. ఆ మూవీ ఏంటంటే.?
ఈ నిర్మాణ సంస్థలకు అర్ద శతాబ్దం పూర్తి.. ఇప్పటికి టాప్‌లోనే..
తెలుగులో కాయాదు చేసిన ఏకైక సినిమా ఇదే..