కొత్త వాహనాల చక్రాల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు.. 

TV9 Telugu

16 July 2024

హిందువులు కొత్త వాహనాలు తీసుకున్నప్పుడు గుడికి తీసుకొని వెళ్లి పూజలు చేసి చక్రాలు కింద నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తారు.

ఇలా చేయడం వల్ల వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగదని హిందువుల నమ్మకం. అయితే దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం తెలుసా.?

పూర్యకాలంలో ప్రజలు గుర్రపు బండ్లు, ఏండ్ల బండ్లును రవాణా కోసం ఉపయోగించేవారు. వారి ద్వారానే ఎక్కువ దూరం వెళ్లేవారు.

అయితే మార్గం మధ్యలో బురద, నీటి మధ్యలో ప్రయాణం చేయాల్సివచ్చేదే. దీనివల్ల గుర్రాలు, ఎడ్ల కాళ్ళకు ఇన్ఫెక్షన్ అయ్యింది.

బురదలో ఉండే క్రిములు గుర్రాలు, ఎడ్ల కాళ్ళలోని క్రిములు చేరకుండా ఉండేందుకు వాటితో నిమ్మకాయలను తొక్కించేవారు.

నిమ్మకాయలోని ఔషద గుణాల కారణంగా వీటి కాళ్ళకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడేది. దీంతో ప్రయాణం సాఫీగా సాగేది.

అప్పటినుంచి ఇప్పటివరకు ప్రజలు దీన్ని ఆ నమ్మకంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు రబ్బర్ టైర్లు వచ్చిన ఇదే చేస్తున్నారు.

ఇది నిమ్మకాయలు తొక్కించడం వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ కారణం. ప్రతి హిందూ నమ్మకం వెనుక ఆ శాస్త్రీయ కోణం దాగి ఉంటుంది.