TV9 Telugu

ఎరుపు అంటే ఎద్దులకు ఎందుకంత కోపం ?

01 March 2024

ప్రత్యేక వేష‌ధార‌ణ‌ల్లో ఉండే బుల్ ఫైట‌ర్స్ ఎద్దుల‌కు ఎరుపు రంగు వ‌స్త్రాల‌ను చూపుతూ వాటిని రెచ్చగొడుతుంటారు.

ఎద్దులు నిజంగానే ఎరుపు రంగును చూస్తే కోపంగా ప్రవ‌ర్తిస్తాయా ? దీని వెనుక ఉన్న అస‌లు కారణాలేంతో తెలుసుకుందాం.

భూమిపై ఉండే జీవులన్నింటిలోనూ కోతులు, గొరిల్లాలు, మ‌నుషులు మాత్రమే అన్ని రంగుల‌ను చూడ‌గ‌ల‌రు. మిగిలిన ఏ జీవులూ రంగుల‌ను గుర్తించలేవు.

అయితే ఎద్దుల విష‌యానికి వ‌స్తే అవి ఎరుపైనా, ఇత‌ర ఏ రంగు అయినా స‌రే వాటికి ఒకే మాదిరిగా క‌నిపిస్తుంది.

ఎరుపును చూడలేవు. ఎరుపు అంటే వాటికి కోపం ఉండ‌దు. ఎరుపు రంగును చూసి కోపంగా ప్రవ‌ర్తించ‌వు. ఎద్దుకు కోపం వస్తుందనేది అపోహ.

ఎద్దుకు కోపం వచ్చేది ఎర్రటి గుడ్డతో కాదు, అది కదిలే విధానానికి. ఎద్దు బట్టల రంగు గురించి పట్టించుకోదు.

ఆటలో ఒక గుడ్డను దాని ముందుకి కదిలిస్తే, అది కోపంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఎవరిపైనైనా దాడి చేస్తుంది.

స్పెయిన్‌లో బుల్ ఫైట్లు ప్రారంభం అయిన‌ప్పటి నుంచి ఎరుపు రంగు వస్త్రాల‌నే చూపించ‌డం అనవాయితీగా వస్తోంది.