శౌర్యాంగపర్వం మొదలయ్యది ఎప్పుడు.? 

31 December 2024

Battula Prudvi

పాన్ ఇండియా స్టార్ హీరో రెబెల్ స్టార్ ప్రభాస్‌ గురించి రోజుకో వార్త న్యూస్‌లో ట్రెండ్‌ అవుతూనే ఉంది.

ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన సలార్ పార్ట్ 2 శౌర్యాంగపర్వం సెట్స్‎లో ఎప్పుడు జాయిన్‌ అవుతారనే సంగతి వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం సలార్‌ పార్ట్ 2 శౌర్యాంగపర్వం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఏప్రిల్‌ నెలాఖరు నుంచి శౌర్యాంగపర్వం షూటింగ్ మొదలవుతుందని అనుకోవచ్చు. ఫస్ట్ షెడ్యూల్‌లో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ మీద కీలక సన్నివేశాలను ప్లాన్‌ చేస్తున్నారు.

ఆ తర్వాత సెకండ్‌ షెడ్యూల్‌లో బాబీ సింహా, శ్రియా రెడ్డి, జగపతిబాబు మీద ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తారు.

ఈ సినిమా మూడో ఎపిసోడ్‌ తెరకెక్కించే సమయానికి ప్రభాస్‌ సెట్స్ లో జాయిన్‌ అవుతారన్నది ఇప్పటికున్న న్యూస్‌.

ప్రస్తుతం డార్లింగ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నారు, ఇటీవల రాజా సాబ్ షూటింగ్ పూర్తి చేసారు.

2025లోనే కల్కి పార్ట్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత స్పిరిట్, హోంబాలే ఫిల్మ్స్‎లో 3 సినిమాలు చేయనున్నారు.