గీతామాధురి, తారక్ మధ్య రిలేషన్ ఏంటి.?
31 December
2024
Battula Prudvi
అదేం ప్రశ్న.. గీతా మాధురి సింగర్. తారక్ స్టార్ హీరో. వీరిద్దరూ ఒకరికొకరు ఏమవుతారు? ఏమీ అవ్వరుగా... అని అనుకుంటున్నారా?
జూనియర్ ఎన్టీఆర్‌ని తారక్ అని పిలుచుకోవడం సంగతి సరే... అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది గీతామాధురి కొడుకు తారక్ గురించి.
తన ముద్దుల తనయుడికి ధ్రువధీర్ తారక్ అని పేరు పెట్టుకొన్నారు సింగర్ గీతామాధురి, హీరో నందు దంపతులు.
2024లో మార్చ్ నెలలో బారసాల చేసి కొడుకు పేరును ప్రకటించారు టాలీవుడ్ స్టార్ దంపతులు గీతామాధురి, నందు.
అప్పట్లో తారక్ బారసాల ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. గీతామాధురి, నందు దంపతులకు ఇదివరకే ఓ కూతురు ఉంది.
పాప పేరు దాక్షాయణి. 2024లో పుట్టిన మగబిడ్డకు ధ్రువధీర్ తారక్ అని పేరు పెట్టారు గీతామాధురి, నందు దంపతులు.
వెండి ఊయలలో తారక్ బారసాలను ఘనంగా నిర్వహించారు ఈ దంపతులు. కొంతమంది సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ప్రముఖ సంగీత దర్శకుడు కల్యాణిమాలిక్‌తో పాటు పలువురు సంగీత ప్రముఖులు ఈ వేడుకకు హాజరై తారక్‌ని ఆశీర్వదించారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అలాంటివి నాకు చేతకాదు: తాప్సి..
ఆ సినిమా కోసం 17 గంటలు పని చేసిన కృతి..
డబ్బులు ఇస్తామంటే అడగండి: శృతి..