వితిక 11 సంవత్సరాల వయస్సులో బాలనటిగా తన నటన జీవితాన్ని ప్రారంభించింది. 15 ఏళ్ల వయస్సులో 2008లో అంతు ఇంతు ప్రీతి బంతు కన్నడచిత్రంతో సినీరంగ ప్రవేశంచేసింది.
ఆ తరువాత కన్నడలోనే 2009లో ఉల్లాస ఉత్సాహ సినిమాలో నటించింది. 2009లో ప్రేమించు రోజుల్లో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.
ఆ తర్వాత సందడి, ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో మరి, మహాబలిపురం సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగా అలరించింది.
పడ్డానండి ప్రేమలో సినిమా షూటింగ్ సమయంలోనే వరుణ్ సందేశ్ తో ప్రేమలో పడింది వితిక. ఆ తర్వాత పెద్దల అశీర్వాదంతో 2016లో పెళ్లిపీటలెక్కారు.
2019లో టీవీ రియాలిటీ కార్యక్రమమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 పోటీలో ఇద్దరూ సందడి చేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది వితికా షేరు.
పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటనను తగ్గించి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోషూట్‌లు, యూట్యూబ్ వీడియోలతో అభిమానులను అలరిస్తోంది.
ఆమె తన యూట్యూబ్ ఛానెల్‌లో వివిధ క్రియేటివ్ వీడియోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.