విశ్వక్ సేన్ కొత్త చిత్రానికి అదిరిపోయే టైటిల్..

01-August-2023

కృష్ణచైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయిక.

అంజలి కీలక పాత్రలో కనిపించనుంది.

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రమిది.

తాజాగా సోమవారం ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించారు మూవీ మేకర్స్.

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ అనే  పేరును ఈ చిత్రానికి ఖరారు చేశారు.

టైటిల్‌ను ప్రకటిస్తూ ఓ గ్లింప్స్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.

1990ల నేపథ్యంలో గోదావరి గ్యాంగ్‌ వార్స్‌, రాజకీయాలు  కథాంశంతో రూపొందుతోంది.