నీల్‌ కోసం ప్రయాణమైన తారక్‌.. 

26 April 2025

Prudvi Battula 

అసలు గ్యాప్‌ తీసుకోవడం లేదు ఎన్టీఆర్‌. మొన్న మొన్నటిదాకా వార్‌2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు నీల్‌ కోసం బయలుదేరారు.

ప్రశాంత్‌ నీల్‌ సెట్స్‎లో జాయిన్‌ కావడానికి బయలు దేరిన ఆయన్ని నిర్మాతలు సాగనంపే విజువల్స్ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి.

ఏప్రిల్‌ 22 నుంచి ఫైర్‌ మామూలుగా ఉండదన్నది మేకర్స్ చెబుతున్న మాట. దీంతో తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకొంటున్నారు.

మాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఆన్‌ ది వే టు కర్ణాటక అని అక్కడి ఫ్యాన్స్ కూడా తెగ ఖుషీ అవుతున్నారు. కర్ణాటకలో లాంగ్‌ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారట ప్రశాంత్‌ నీల్‌.

ఆల్రెడీ తారక్‌ లేకుండా ఓ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేశారు. ఇప్పుడు ఈ షెడ్యూల్‌ని కూడా పక్కా యాక్షన్‌ సీక్వెన్స్ తోనే స్టార్ట్ చేస్తారట.

దాంతో పాటు కీ సీన్స్ కూడా తెరకెక్కిస్తారని టాక్‌. డ్రాగన్‌ అరైవల్‌ మామూలుగా ఉండదని.. తారక్‌ స్వాగ్‌ చూస్తేనే అర్థమవుతుందని సంబరపడుతున్నారు అభిమానులు.

మాస్‌.. మెంటల్‌ మాస్‌.. అంటూ తారక్‌ స్వాగ్‌ చూసిన అభిమానులు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు వీడియో షేర్‌ చేస్తూనే ఉన్నారు.

తారక్ నటిస్తున్న వార్ 2 షూట్ కూడా పూర్తయింది. త్వరలో దేవర పార్ట్ 2 షూట్ కూడా మొదలుకానున్నట్లు సమాచారం.