తెలుగు సినీ పరిశ్రమలో పవర్‌ఫుల్ లేడీ విలన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు 'రమ్యకృష్ణ'. నరసింహా, నీలాంబరి చిత్రాల్లో హీరోకు సమానంగా ఆమె నటించిన తీరు అందరినీ మెప్పిస్తుంది.
ఇప్పుడు జనరేషన్ మారింది. ఇప్పుడా ప్లేస్‌లోకి వరలక్ష్మి శరత్‌కుమార్ వచ్చేసిందని చాలామంది నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తుంటారు. అంతలా ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది.
వరలక్ష్మికి తెలుగులో స్టార్ ఇమేజ్ అందించిన చిత్రం ‘క్రాక్’ . గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో జయమ్మగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.
ఆ పాత్రలో ఆమె పలికించిన హావభావాలు తెలుగువారిని మెప్పించాయి. ముఖ్యంగా ఆమె బేస్ వాయిస్ ఈ పాత్రకు హైలైట్‌గా నిలిచింది.
తరువాత ఇదే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'వీర సింహారెడ్డి' సినిమా తనకు మరింత పేరును తీసకువచ్చింది.
ఇదే ఏడాదిలో సంక్రాంతికి విడుదలైన వీరసింహ రెడ్డి లో 'భానుమతి' పాత్రలో బాలయ్యకు సోదరిగా నటించి మరింత స్టార్ ఇమేజ్‌ను పెంచుకుంది.
వరసు విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న డైరెక్టర్ గోపీచంద్ మళ్లీ రవితేజతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన క్రాక్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది.
దీంతో మళ్లీ మరో ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఇందులో కూడా తన లక్కీ ఛార్మ్ అయిన వరలక్ష్మి కోసం ప్రత్యేక రోల్‌ను ఆయన క్రియేట్ చేస్తున్నాడట.
ఈ సినిమా కోసం హీరోయిన్ ఎంపిక చేయడం కంటే ముందు వరలక్ష్మి ఎంపిక జరిగిపోయిందట. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెను గోపీచంద్ ఇప్పటికే సంప్రదించాడని టాక్.
ఇలా తన సినిమాలో జయమ్మ ఉంటే అది సూపర్ హిట్ ఖాయం అని ఆయన భావిస్తున్నారట.