ఆ కండిషన్ ఒప్పుకుంటేనే సినిమా చేస్తా: వైష్ణవి చైతన్య
Pic credit - Instagram
వైష్ణవి చైతన్య ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్నటువంటి పేరు. యూట్యూబ్ వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది వైష్ణవి చైతన్య.
కెరియర్ మొదట్లో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించినటువంటి వైష్ణవి చైతన్య ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలను అందుకుంటున్నారు.
వైష్ణవి చైతన్య హీరోగా నటించిన బేబీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసింది.
ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇలా వరుస ఆఫర్ రావడంతో కెరియర్ పరంగా వైష్ణవి చైతన్య బిజీ అవుతున్నారు.
ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నటువంటి తరుణంలో తదుపరి సినిమాలకు భారీగా కండిషన్లు పెడుతున్నట్టు తెలుస్తుంది.
ఈమె రెండో సినిమాకి దర్శక నిర్మాతలకు కండిషన్స్ పెట్టారని ఈ కండిషన్స్ కి ఒప్పుకుంటేనే సినిమాకు సాయం చేస్తాను అంటూ భీష్మించుకొని కూర్చున్నారని తెలుస్తోంది.
తాను సినిమాలకు చేయాలి అంటే ముందుగా అడ్వాన్స్ చెల్లించాలని.. ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వాలని రూల్స్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇలా రెండో సినిమాకి వైష్ణవి చైతన్య ఈ స్థాయిలో కండిషన్స్ పెట్టడంతో పలువురు ఈమె పట్ల విమర్శలు కురిపిస్తున్నారు.