వైష్ణవి చైతన్య వయ్యారాలకు.. ఫిదా అయిపోతున్న కుర్రకారు

23 May 2026

Pic credit - Instagram

Phani Ch

తెలుగు అందం వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. 'బేబీ' సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన యంగ్ బ్యూటీ.

ఈ ముద్దుగుమ్మ  జనవరి 4, 1993న విజయవాడలో జన్మించిన.. చదువు అంతా హైదరాబాద్‌లోనే పూర్తి చేసింది.

చదువు పూర్తి చేసి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీ ప్రస్థానం మొదలుపెట్టింది. మొదట డబ్‌స్మాష్, టిక్‌టాక్ వీడియోలతో యూత్‌లో క్రేజ్ సంపాదించింది.

'ది సాఫ్ట్‌వేర్ డెవలపర్', 'మిస్సమ్మ' వంటి షార్ట్ ఫిల్మ్స్‌తో యూత్ లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

'టచ్ చేసి చూడు' సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. 'అల వైకుంఠపురములో', 'రంగ్‌దే', 'టక్ జగదీశ్' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది.

2023లో 'బేబీ' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ. ఆనంద్ దేవరకొండ సరసన నటించి, బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

మరో సారి ఆనంద్ దేవరకొండ తో వైష్ణవీ చైతన్య  ఎపిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పక్కా లోకల్ అబ్బాయి ఫారిన్ వెళితే పడే ఇబ్బందులను కామెడీగా చూపిస్తూనే.. ఎమోషనల్ లవ్ ట్రాక్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.