25 August 2023

ఇప్పటికి తగ్గని ఉప్పెన ప్రభంజనం.. నేషనల్ అవార్డు సైతం.

ఆఫ్టర్ కోవిడ్ థియేటర్లకు ఆడియన్స్ వస్తారా లేదా అనుకుంటున్న టైమ్‌లో వంద కోట్ల వసూళ్లు సాధించిన తెలుగు సినిమా ఉప్పెన.

ఈ మూవీ ఇప్పుడు నేషనల్ అవార్డ్స్‌లోనూ సత్తా చాటింది. గతంలో టీవీ 9 నవ నక్షత్ర సన్మానంలోనూ సత్తా చాటింది ఈ మూవీ.

2022లో టీవీ 9 నవ నక్షత్ర సన్మానంలో పబ్లిక్ పాపులర్ చాయిస్ అవార్డ్‌తో ఉప్పెన స్టార్స్‌ను సన్మానించింది టీవీ 9.

ఇప్పుడు అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఇదే ఉప్పెన సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రం నేషనల్ అవార్డు సాధించింది. 

బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయం అవుతూ వచ్చిన ఉప్పెన సినిమాతో మెగా వారసుడు వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి వెండితెరకు పరిచయమయ్యారు.

అందరూ కొత్త టీం , తొలి సినిమాతోనే తమ మార్క్ చూపించిన ఈ డెబ్యూ స్టార్స్‌ వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

లవ్ , ఎమోషన్స్ , ఇందులోని స్టార్స్‌, నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే మ్యూజిక్‌ అన్ని పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వటంతో ఉప్పెన సెన్సేషనల్ హిట్ అయ్యింది.

అందుకే ఇప్పుడు జాతీయ వేదిక మీద కూడా సత్తా చాటింది ఈ మూవీ.  ఉత్తమ ప్రాంతీయ చిత్రం నేషనల్ అవార్డు సాధించింది.