వైరల్ అవుతున్న త్రిష టాటూ.. అర్ధం ఏంటంటే.? 

Prudvi Battula 

Images: instagram

13 November 2025

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తోన్న వారిలో త్రిష కృష్ణన్ కూడా ఒకరు.

త్రిష కృష్ణన్

అప్పుడెప్పుడో 2003లో నీ మనసు నాకు తెలుగు సినిమాతో హీరోయిన్‎గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తుంది.

2003లో ఇండస్ట్రీకి

1999లో "మిస్ సేలం" కిరీటాన్ని, 2001లో మిస్ ఇండియా ద్వారా "బ్యూటిఫుల్ స్మైల్" అవార్డును కూడా గెలుచుకుంది.

బ్యూటీ అవార్డులు

త్రిష వయసు ప్రస్తుతం సుమారు 40 ఏళ్లకు పైగానే. అయినప్పటికీ అందం మాత్రం తగ్గడం లేదు. ఎవర్ గ్రీన్ బ్యూటీగా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది.

కుర్ర హీరోయిన్లకు పోటీ

అయితే ఇటీవల ఓ ఈవెంట్‎కు హాజరైన త్రిష కెమెరాలకు పోజులిచ్చింది. అందులో ఆమె భుజంపై ఉన్న టాటూ బాగా హైలెట్ అయ్యింది.

భుజంపై ఉన్న టాటూ

సినిమాల కోసం కెమెరా ముందుకు వచ్చిన త్రిష... ఆ కెమెరానే తన భుజంపై టాటూగా వేయించుకొని అందరిని అక్కట్టుకుంది.

కెమెరానే టాటూగా

ప్రస్తుతం త్రిష టాటూ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఇది చూసిన సినీ అభిమానులు, నెటిజనలు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

క్రేజీ కామెంట్స్

ఇటీవలే థగ్ లైఫ్ సినిమాలో కనిపించిన త్రిష.. ప్రస్తుతం తెలుగులో విశ్వంభర సినిమాతో పాటు మరి కొన్ని భాషల్లో సినిమాలు చేస్తుంది.

సినిమాలు