Trisha

21 September 2023

తన పెళ్లి న్యూస్‌పై.. త్రిష దిమ్మతిరిగే రియాక్షన్

Pic credit - Instagram

Trisha Pics

40యేళ్ల వయసులోనూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న త్రిష్.. తాజాగా సోషల్ మీడియాలో హాట్ కేక్‌లా మారిపోయారు.

Trisha Photos

తన పెళ్లి న్యూస్‌ కారణంగా..రిపీటెడ్‌గా.. అక్రాస్ సోషల్ మీడియా ప్లాట్‌ ఫాంలలో వైరల్ అవుతూనే ఉన్నారు.

Trisha Latest Photos

ఇక తాజాగా కూడా.. ఓ మలయాళ ప్రొడ్యూసర్ కమ్ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారనే క్రేజీ న్యూస్‌తో అంతటా హాట్ టాపిక్ అయ్యారు.

అయితే ఎప్పటి న్యూస్‌లానే ఈ న్యూస్‌ను కూడా గట్టిగా పట్టుకున్న త్రిష ఫ్యాన్స్‌ .. ఇదే నిజం అనుకున్నారు. త్రిష్‌కు నెట్టింట విషెస్ చెప్పడం మొదలెట్టారు.

అటు కోలీవుడ్ ఫేమస్‌ మీడియా హౌసెస్‌ కూడా త్రిష పెళ్లి వార్తను .. ప్రముఖంగా కవర్‌ చేయడం స్టార్ట్ చేశారు.

దీంతో రంగంలోకి దిగిన త్రిష.. తాజాగా తన పెళ్లి వార్తలపై ఇన్‌డైరెక్ట్‌గా దిమ్మతిరిగే రియాక్షన్ ఇచ్చారు. పంచీగా ఓ ట్వీట్ చేశారు.

'డియర్.. నువ్వెవరు, నీ టీమ్‌ ఎవరన్నది నీకు తెలుసు. కామ్‌గా ఉండండి.. రూమర్లు ఆపండి' అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు త్రిష.

అయితే ఈ ట్వీట్‌నే రీ ట్వీట్ చేస్తున్న త్రిష్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ .. తన పెళ్లిపై త్రిష రియాక్షన్ ఇదే అంటూ.. నెట్టింట హంగామా చేస్తున్నారు. 

మలయాళీ ప్రొడ్యూసర్‌తో త్రిష్ పెళ్లి అనేది రూమర్ అని.. అది వైరల్ అవ్వడాన్ని ఆవాలని.. త్రిష తరుపున ఆమె ఫ్యాన్స్ రెక్వెస్ట్ చేస్తున్నారు.