ఇదెక్కడి క్రేజ్ సామీ.. ఒక్క సినిమాకు త్రిష రెమ్యునరేషన్ తెలిస్తే..

Rajitha Chanti

Pic credit - Instagram

15 June 2026

దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ త్రిష. నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని క్రేజ్ తో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. 

ఇటీవల కొంత కాలంగా వరుస సినిమాలతో భారీ విజయాలను అందుకుంటుంది. ఆమె నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. ఇప్పటికీ ఇండస్ట్రీలో బిజీగా ఉంది త్రిష.

ఈ క్రమంలోనే అటు తమిళ్.. ఇటు తెలుగులోనూ ఈ అమ్మడి క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. 

ప్రస్తుతం  ఒక్కో సినిమాకు రూ.6 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న ఈ చెన్నై చందమామ.. ఇప్పుడు తన రెమ్యునరేషన్ పెంచేసిందని.. అందుకు నిర్మాతలు కూడా ఓకే అంటున్నారని టాక్.

ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం త్రిష ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమె నటించిన కరుప్పు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.

సూర్య హీరోగా నటించిన కరుప్పు మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ సైతం పెంచేసిందని టాక్.

 ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది త్రిష. ఈ సినిమాకు ఆమె కేవలం రూ.6 కోట్లు మాత్రమే తీసుకుంటుందని. కానీ తర్వాతి చిత్రాలకు రెమ్యునరేషన్ పెంచేసిందట.

మరోవైపు త్రిషకు  మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నట్లు టాక్. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.