ఇన్‌స్టాలో ఈ బ్యూటీల క్రేజే వేరప్పా.. 

TV9 Telugu

25 February  2024

పెళ్లిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్రీలీలా అనతికాలంలోనే అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ బ్యూటీకి ఇన్‌స్టాలో ఏకంగా 4.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

ఇక ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారిన మరో బ్యూటీ కృతిశెట్టి. ఒక్కసినిమాతోనే భారీ క్రేజ్‌ సంపాదించుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం ఇన్‌స్టాలో ఏకంగా 7.8 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

పుష్పతో ఒక్కసారిగే నేషనల్ క్రష్‌గా మారిన అందాల తార రష్మికు సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీకి ఇన్‌స్టాలో ఏకంగా 41.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. 

అందాల తార తమన్నకు సోషల్‌ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిల్కీ బ్యూటీకి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 25.1 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. 

తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన అనుపమ పరమేశ్వరన్‌కు ఇన్‌స్టాలో భారీ క్రేజ్‌ ఉంది. ఈ బ్యూటీకి ప్రస్తుతం మొత్తం 15.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

వివాహ బంధంతో కొత్త లైఫ్‌ ప్రారంభించిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీకి ప్రస్తుతం 23.6 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ చెరగని అందంతో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న త్రిషకు ఇన్‌స్టాలోనూ ఫాలోవర్స్‌ ఎక్కవనే చెప్పాలి. ఈ బ్యూటీకి ప్రస్తుతం ఇన్‌స్టాలో 6.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోయల సరసన నటించి మెప్పించిన రాఖీఖన్నాకు సోషల్‌ మీడియాలో భారీ క్రేజ్‌ ఉందని తెలిసిందే. ఈ బ్యూటీకి ప్రస్తుతం ఇన్‌స్టాలో 10.8 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.