28 May 2024

ఈ ముద్దుగుమ్మలు.. ఖాళీ సమయంలో ఏం చేస్తారో తెలుసా.? 

Narender.Vaitla

అందాల రాశీ.. రాశీఖన్నా షూటింగ్స్‌ లేని సమయంలో గిటార్‌ ప్లే చేస్తుందంటా. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా గిటార్‌ ప్రాక్టీస్‌ చేస్తానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఇక తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసే అందాల తార పాయల్ రాజ్‌పుత్‌కు వంట చేయడం అంటే తెగ ఇష్టమంటా. ఖాళీ సమయాల్లో రకరకాల వంటకాలు ట్రై చేస్తుందంటా.

నిత్యం సినిమాలు, వ్యాపారాలతో బిజీగా ఉండే సమంతకు గార్డెనింగ్ అంటే ఎంతో ఇష్టమంటా. గతంలో సమంత టెర్రస్‌ ఫార్మింగ్ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే.

అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు బీచ్‌కు వెళ్లడం అంటే తెగ ఇష్టమంటా. సినిమాలకు ఏమాత్రం మేక్‌ దొరికినా వెంటనే సముద్ర తీరంలో వాలిపోతుందంటా.

బాలీవుడ్ బ్యూటీ, దివగంత అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు పెయింటింగ్ అంటే చాలా ఇష్టంమంటా. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో పెయింట్ వేస్తానని గతంలో చాలా సార్లు తెలిపింది.

అందాల తార నివేదా పేతురాజ్‌కు క్రీడలు అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. సినిమాలకు బ్రేక్‌ ఉన్న సమయంలో ఏదో ఒక స్పోర్ట్స్‌తో బిజీగా ఉంటానని చెప్పుకొచ్చింది.

మరో అందాల తరా నభా నటేష్‌కు కూడా పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వెంటటే బ్రష్‌ పట్టుకుంటానని చెపప్పుకొచ్చింది.

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌కు పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం. ఇంట్లోనే ఓ చిన్న సైజ్‌ లైబ్రరీని మెయింటేన్‌ చేస్తుందీ బ్యూటీ