పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఆలు పరోటా, గులాబీ జామ్ అంటే తెగ ఇష్టమంటా. అయితే ఎంత ఇష్టంగా తింటుందో పెరిగిన బరువు తగ్గడానికి అదే స్థాయిలో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తానని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
నేషనల్ క్రష్ రష్మికకు నెయ్యితో వేసిన దోశ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తానే స్వయంగా దోసెలు వేసుకొని తింటానని తన అభిరుచి తెలిపింది.
మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ శృతిహాసన్‌కు చికెన్ సాంబార్ అంటే ఎంతో ఇష్టమని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఇంటా బయటా అనే తేడా లేకుండా ఎక్కడ కనిపించినా తింటానని తెలిపింది.
ఇక సమంతకు స్వీట్ పొంగల్ అంటే ప్రాణమంటా. అలాగే సాంబార్‌ను ఎంతో ఇష్టంగా తింటానని తెలిపిన సామ్.. పాలకోవాతో చేసిన పదార్థాలను ఇష్టంగా తింటానని తెలిపింది.
కాజల్ అగర్వాల్‌కు హైదరాబాద్ బిర్యానీ అంటే తెగ ఇష్టమని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా బిర్యానీ తింటానని తెలిపింది.
అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నాకు బిర్యానీ అంటే ఎంతో ఇష్టమంటా. అలాగే చేపలు పులుసును కూడా ఎంతో ఇష్టంగా తింటానని తెలిపిన రాశి, మామిడికాయ పికిల్ అంటే కూడా తనకు ఇష్టమని తెలిపింది.
నటి నయనతారకు ఇడ్లీ సాంబార్ అంటే ఎంతో ఇష్టమని గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది. ఇక దీంతో పాటు లంచ్‌లోకి చికెన్ బిర్యాని, చేపల కూరను ఎంతో ఇష్టంగా తింటానని తెలిపింది.