కుర్ర హీరోయిన్స్ కు గట్టిపోటీ ఇస్తున్న సీనియర్ భామ ప్రియమణి 

14 November 2025

Pic credit - Instagram

Rajeev 

18 ఏళ్ల వయసులోనే నటిగా సినీప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. 2003లో ఎవరే అతగాడు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత 2007లో తమిళ చిత్రం పరుత్తివీరన్‌లో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. 

 మణిరత్నం దర్శకత్వం వహించిన రావణ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు.

అయితే కొన్నాళ్లు తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిన ప్రియమణి 2013లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో కనిపించింది.

ఇందులో షారుఖ్ ఖాన్ తో కలిసి 1234 అనే స్పెషల్ సాంగ్ తో ఇరగదీసింది. అప్పట్లో ఈ సాంగ్ సెన్సేషన్ అయ్యింది.

 ఆ తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్, ఆర్టికల్ 370 వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.

2017లో ప్రియమణి ఈవెంట్ మేనేజర్ నుండి సినిమా డైరెక్టర్‌గా మారిన ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకుంది.