అందాల తార సమంత చదువులో కూడా టాపర్ అని మీకు తెలుసా.? చిన్ననాటి నుంచి చదువులో ఫస్ట్ ఉండే సమంత.. చెన్నైలో బీకామ్ పూర్తి చేశారు. అనంతరం 2010లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన చదువులోనూ ఎప్పుడూ ముందుండేది. ఈ బ్యూటీ సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అందంలోనే కాదు ఎడ్యుకేషన్‌లోనూ ముందుందీ బ్యూటీ.
అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ బీఎస్పీ పూర్తి చేశారు. కెరీర్ తొలినాళ్లలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతోంది. అయితే త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కనుంది.
యోగా ట్రైనర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనుష్క.. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం యోగా ట్రైనర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, టాలీవుడ్‌లో అగ్ర కథానాయికుల్లో ఒకరిగా నిలిచారు అనుష్క.
ఇక మహానటి కీర్తీ సురేష్ కూడా కెరీర్‌ను నిర్లక్ష్యం చేయలేదని చెప్పాలి. ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రంగాన్నే ఎంచుకుంది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఈ బ్యూటీ అనంతరం సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా నిలిచింది.
పూజా హెగ్డే కాలేజీ రోజుల్లో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనే ఈ బ్యూటీ, కామర్స్‌లో పీజీ పూర్తి చేశారు. అనంతరం మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చారు.
నటనకు పెట్టింది పేరుగా నిలిచే సాయి పల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందీ చిన్నది. ఒక ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు, పరీక్షలకు సైతం హాజరైందీ బ్యూటీ.
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అందాల తార నయనతార బీఏ ఇంగ్లిష్ లిటరేచర్‌ను పూర్తి చేశారు. అనంతరం 2003లో మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఇచ్చారు. వివాహం తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది.