అట్లుంటది టిల్లు గానితో.. ఫస్ట్ సాంగ్ విడుదల..
సిద్దు జొన్నలగడ్డ హీరో వస్తున్న చిత్రం ‘టిల్లు స్క్వేర్’.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయక.
మల్లిక్‌రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
తాజాగా బుధవారం ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేసింది చిత్రబృందం.
‘టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా... ’ అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకొనేలా ఉంది.
కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల స్వరపరిచి, ఆలపించారు.
కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి