50 ఏళ్లులోనూ 20 ఏళ్ల పడుచు పిల్లలా.. అమీషా ఫిట్‌నెస్‎ సీక్రెట్ ఇదే..

15 May 2025

Prudvi Battula 

2000లో కహో నా... ప్యార్ హై అనే సినిమాతో హీరోయిన్‎గా బాలీవుడ్ చలనచిత్ర అరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ అమీషా పటేల్.

పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత నాని, నరసింహుడు, పరమ వీర చక్ర సినిమాల్లో నటించింది.

ఈ ఏడాది జూన్ నెలకి ఈమెకి 50 ఏళ్లు పూర్తికావస్తోంది. అయినప్పటికీ ఫిట్‌నెస్ విషయం ఇప్పట్టి హీరోయిన్లతో పోటీపడుతోంది.

స్క్వాట్స్ శరీర వ్యాయామాలలో ఒకటి. సీనియర్ నటి అమీషా పటేల్ దీనిని తన ఫిట్‌నెస్ దినచర్యలో చేర్చుకుంది.

ఈమె ఫిట్‎గా ఉండటానికి మరొక కారణం కెటిల్‌బెల్ స్వింగ్స్ వ్యాయామం. ఇది శరీరంలో కండరాలను బలోపేతం చేస్తుంది.

అమీషా డైలీ రొటీన్‎లో డెడ్‌లిఫ్ట్ వర్కౌట్ కూడా చేర్చుకుంది. దీనివల్ల వయసు పైబడుతున్న కూడా చాలా ఫిట్‎గా ఉంటారు.

అమీషా పటేల్ మనస్సు-శరీర సంబంధాన్ని గట్టిగా విశ్వసిస్తుంది. మానసిక ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం క్రమం తప్పకుండా సాధన చేస్తుంది.

ఈమె ఫిట్‌నెస్ కోసం ఆహారంలో లీన్ ప్రోటీన్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు, కూరగాయలు చేర్చుకుంది.